టెన్త్ క్లాస్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఒత్తిడి తగ్గేలా

by Shyam |   ( Updated:2021-02-10 01:56:18.0  )
టెన్త్ క్లాస్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఒత్తిడి తగ్గేలా
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణకు టెన్త్ క్లాస్ విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేలా భారీ మార్పులు చేసింది. పరీక్షల్లో రెట్టింపు ఆప్షన్లు ఉండేలా ప్రశ్నాపత్రాలు తయారు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి సబ్జెక్ట్ లో 50శాతం ఛాయిస్ ఉండేలా క్వశ్చన్ పేపర్ ను తయారు చేయనుంది. ఆ 50శాతం ఛాయిస్ ఎలా ఉండబోతుందనే విషయం విద్యార్ధులకు తెలిపేందుకు త్వరలో నమూనా ప్రశ్నాపత్రాలను వెబ్‌సైట్లో ఉంచనుంది విద్యాశాఖ. తాజా సమాచారం ప్రకారం ఆబ్జెక్టివ్‌కు 20, ఇంటర్నల్స్‌కు 20, వ్యాసరూప ప్రశ్నలకు 60మార్కులుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రకటన అధికారికంగా రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed