‘సీఎం కేసీఆర్ నిర్ణయం.. 30 వేల మందికి లాభం’

by Shyam |
‘సీఎం కేసీఆర్ నిర్ణయం.. 30 వేల మందికి లాభం’
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటివిడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరమే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసే గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని గోసుల శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల దాదాపు 30 వేల మంది గొల్లకురుమలకు లాభం జరుగుతున్నదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం వల్లనే తెలంగాణలో జీవాల సంపద పెరిగిందన్నారు. కేంద్రం విడుదల చేసిన 2019-20 నివేదికలో గొర్రెల పెంపకంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమం వల్లనే ఇది సాధ్యమైందని గోసుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగించి, గొల్లకురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సీఎం కృషి చేయాలన్నారు.

Advertisement

Next Story