మరింత తగ్గిన బంగారం ధరలు

by  |
మరింత తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరలు (Gold prices) వరుసగా మూడోరోజు తగ్గిపోయాయి. అమెరికా డాలరు బలపడటంతో ఆ ప్రభావం బంగారం ధరలపై పడిందని, అదేవిధంగా అమెరికాలో మరో ఉద్దీపణ ప్యాకేజీ (Stimulus package) ఉండకపోవచ్చనే అంచనాల కారణంగా బంగారం ధరలు ప్రతికూలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 760 తగ్గి రూ. 52,470కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 700 తగ్గి రూ. 48,100కు చేరుకుంది. వెండి ధరలు కూడా బంగారం ధరల బాటలోనే రూ. 1600 తగ్గి రూ. 59 వేలకు చేరింది. తగ్గుతున్న బంగారం ధరలు వినియోగదారులు కొనుగోలు చేసే స్థాయిలోనే ఉన్నాయని కమొడిటీ మార్కెట్ వర్గాలు (Commodity Market categories)పేర్కొన్నాయి.

ప్రస్తుతం ఉన్న ధరలు సాధారణ స్థాయిలో ఉన్నాయని కొనుగోలు చేసేందుకు తగిన సమయంగా మార్కెట్ నిపుణులు (Market experts)అభిప్రాయపడుతున్నారు. రానున్న కొద్దిరోజుల్లో మరో రూ. 1500 వరకు తగ్గే అవకాశాలున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. డిసెంబర్ నాటికి ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నాయని మోతీలాల్ ఓస్వాల్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ తెలిపారు. ఇక, దేశంలోని మిగిలిన ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు పరిశీలిస్తే..చెన్నైలో 48,100 ఉండగా, ముంబై, ఢిల్లీల్లో 49,000, కోల్‌కతాలో 49,370, బెంగళూరులో 47,500గా ఉంది.


Next Story

Most Viewed