- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్చుతగ్గుల్లో బంగారం!
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో మార్కెట్లు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనపడటంతో ఉద్దీపన చర్యలకు దిగాయి, ఇదే సందర్భంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడుతుండటం, అనేక దేశాల్లో లాక్‌డౌన్ కారణంగా వ్యాపారాలు మూతపడటం వంటి పరిణామాలతో బంగారం హెచ్చు తగ్గులకు గురవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మంగళవారం పది గ్రాముల బంగారం రూ. 2 వేల వరకూ పెరిగినప్పటికీ బుధవారం హెచ్చుతగ్గులకు లోనై స్వల్పంగా క్షీణించింది. కమొడిటీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ. 325 తగ్గి రూ. 44,800 వద్ద కొనసాగుతోంది. వెండి సైతం రూ. 556 తగ్గి కిలో రూ. 42,789 వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 ప్రభావంతో కేసులు పెరగడం ఈ తగ్గుదలకు కారణమవ్వొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిణామాలే కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 16 డాలర్ల వరకూ క్షీణించి 1686 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Tags: Gold price, MCX, Silver, commodity market