- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తగ్గిన బంగారం..ఐదు రోజుల్లో ఐదువేలు!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా ధాటికి మార్కెట్లు భయపడుతుంటే, బంగారం కంగారు పడుతోంది. ఎమ్‌సీఎక్స్ బంగారం ధరలు మంగళవారం 1 శాతం క్షీణించాయి. అంతర్జాతీయంగా అన్ని దేశాలు కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సరిహద్దులను మూసేయడం, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం, వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు భరోసా ఇచ్చే చర్యలను చేపడుతున్నాయి. ఈ ప్రభావంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఎమ్‌సీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ నెలకు బంగారం ఫ్యూచర్స్ రూ. 378 తగ్గి రూ. 39,197కు చేరింది. గత ఐదు రోజుల్లో బంగారం ఏకంగా రూ. 5,000 క్షీణించడం విశేషం.
కరోనా వైరస్ ధాటికి అన్ని దేశాలు వణికిపోతున్నాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీంతో మదుపర్లు బంగారంపై పెట్టిన సొమ్మును వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ప్రభావం కూడా బంగారం ధరలు బలహీనపడటానికి కారణమయ్యాయి. దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటుందనే ఆందోళన వ్యక్తం చేయడంతో యూఎస్ మార్కెట్లు భారీగా దిగజారాయి. 1987 తర్వాత వాల్ స్ట్రీట్ ఈ స్థాయిలో పతనాన్ని చూడటం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు.
బంగారం క్షీణతను చూసి వెండి సైతం నేల చూపులు చూస్తోంది. మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ దాదాపు 2 శాతం వరకూ తగ్గి రూ. 35,590కి చేరుకుంది. ఇంతకుముందు సెషన్ కంటే పది శాతం క్షీణించి రూ. 4,200 తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలు కూడా కమొడిటీ మార్కెట్లపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 1 శాతం క్షీణించి ఔన్సుకు 1,496.78 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు రోజు 5.1 శాతం పతనంతో 2019, నవంబర్ నాటి కనిష్ఠ స్థాయికి తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పులు, ద్రవ్యోల్బణం, జువెలరీ మార్కెట్, సెంట్రల్ బ్యాంకుల వద్దనున్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు వంటి కీలక అంశాలు బంగారం ధరలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి.
tags : Gold price, Gold, MCX Gold, Coronavirus Worries, Gold Price Gains Momentum, Coronavirus Outbreak, Yellow Metal, Gold Trend