- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాత్రూంలో బంగారం లభ్యం.. ఆరా తీస్తున్న అధికారులు
దిశ రాజేంద్రనగర్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సినీ ఫక్కీలో బంగారం దొరికింది. విమానం బాత్ రూంలో బంగారాన్ని వదిలి వెళ్లిపోయారు స్మగ్లర్లు. పోలీసుల కథనం ప్రకారం.. దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న 6ఈ25 ఇండిగో విమానంలోని బాత్రూంను ఎవరో లాక్ చేశారు. దీంతో విమానంలోని ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. బాత్రూంలో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా ఎందుకు లాక్ చేశారని ఆందోళన చెందారు. పైలట్ వెంటనే విమానాశ్రయం అధికారులకు సమాచారం అందించి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ రన్‌వే పై విమానాన్ని ల్యాండ్ చేశారు. అప్పటికే ఎయిర్లైన్స్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ బలగాలు, బాంబు, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. విమానంలో తనిఖీలు నిర్వహించి బాత్రుం తాళాలు పగలగొట్టి పరిశీలించగా బంగారాన్ని గుర్తించారు.
గుర్తు తెలియని గోల్డ్ స్మగ్లర్లు 350 గ్రాముల మూడు బంగారు బిస్కెట్లను ట్యూబ్ లైట్ చౌక్ లో దాచి బంగారాన్ని తరలించడానికి ప్రయత్నించారని అధికారులు గుర్తించారు. తనిఖీల భయంతో విమానంలోని బాత్రూంలో వదిలి వెళ్లారని తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ పోలీసులు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.