సుష్మిత వెబ్ సిరీస్.. జీ5తో ఒప్పందం!

by Shyam |
సుష్మిత వెబ్ సిరీస్.. జీ5తో ఒప్పందం!
X

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల.. తండ్రికి కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసి ప్రశంసలు అందుకుంది. సోదరుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ అడుగుజాడల్లో నడుస్తూ నిర్మాతగానూ మారిపోయింది. భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్’ బ్యానర్ నెలకొల్పిన సుష్మిత.. తాజాగా వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్ పోలీస్, కరడుగట్టిన నేరస్థులు, టెర్రరిస్ట్‌ల నేపథ్యంలో సాగే కథతో నిర్మించబడుతున్న సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయని తెలిపింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5తో ఒప్పందం చేసుకున్నామని.. మా సంస్థ నుంచి వస్తున్న తొలి వెబ్ సిరీస్ కోసం జీ5తో అసోసియేట్ కావడం సంతోషంగా ఉందని వెల్లడించింది. కాగా ‘ఓయ్’ డైరెక్టర్ ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Next Story