తెరచుకున్న గోల్కొండ కోట

by  |
తెరచుకున్న గోల్కొండ కోట
X

దిశ, వెబ్‌డెస్క్: అన్‌లాక్‌ 4.0లో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలకు అనుమతులు వచ్చాయి. ఇదే క్రమంలో తెలంగాణలోని చారిత్రక గోల్కొండ కోట తెరచుకుంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆరునెలలుగా మూసి ఉన్న గోల్కొండ కోటకు పర్యాటకులను అనుమతి ఇస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా రోజుకు 2వేల టిక్కెట్లను మాత్రమే విక్రయిస్తున్నారు. నిన్న 213మంది పర్యాటకులు గోల్కొండ కోటను సందర్శించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పర్యాటకులను లోనికి అనుమతిస్తున్నారు. కోట ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు ఏర్పాటు చేసిన అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Next Story

Most Viewed