- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాపులర్ ఫుడ్ హ్యాబిట్ ‘వీగనిజం’.. హెల్త్‌కి మంచిదేనా?
దిశ, వెబ్‌డెస్క్: వెజిటేరియన్స్, నాన్‌వెజిటేరియన్స్ అందరికీ తెలుసు..ఈ రెండు కాకుండా మరో రకం ఆహారం తీసుకునే వారు ఉన్నారు వారే ‘వీగన్స్’. ప్రస్తుతం చాలా పాపులర్‌గా మారుతున్న ఫుడ్ హ్యాబిట్ ‘వీగనిజం’.. కామన్ మ్యాన్ నుంచి సెలెబ్రిటీల వరకు చాలా మంది ఇప్పుడు ‘వీగన్’గా మారుతున్నారు. ఇదో ట్రెండ్‌లాగా సాగుతోంది. మాంసాహారంతో పాటు, జంతు ఉత్పత్తులను తినని వీగన్స్ వల్ల పర్యావరణానికి, పుడమికి ఎంతో ఉపయోగం ఉంది. అయితే వీగన్ డైట్ వల్ల వీగన్‌లకు ప్రయోజనం ఉందా? వారి ఆరోగ్యానికి ఇది శ్రేయస్కరమేనా? ట్రెండీ ట్యూస్‌డేలో భాగంగా తెలుసుకుందాం.
సాధారణంగా అందరూ ఎవరికి వారే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, కొవిడ్ పుణ్యమాని ఎదుటివారు బాగుండాలని కోరుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా మహమ్మారి రాక తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలో శాకాహారిగా మారితే ఆరోగ్యానికి చాలా మంచిదని, వీగన్‌గా మారడం వల్ల మెరుగైన ఆరోగ్య ఫలితాలుంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే వీగన్‌గా మారడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్న విషయమై ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారమైతే లేదు. కానీ, కొన్ని పరిశోధనలు మాత్రం వీగన్ డైట్ కారణంగా హార్ట్‌ఎటాక్, డయాబెటిస్, డైవర్టికులర్ డిసీజ్‌లు వచ్చే ప్రమాదం తక్కువని తేల్చాయి. ఇందుకు భిన్నంగా.. వీగన్ ఫుడ్ తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉండబోవని, ఫ్యాక్చర్స్ అయ్యే ప్రమాదం ఎక్కువని, హెమర్రాజాక్ స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడించాయి. వీగన్లపై జరిపిన మరో అధ్యయనం ప్రకారం పూర్తిగా శాకాహారమే తీసుకున్న వారికీ కొన్ని ఆరోగ్య సమస్యలు రావొచ్చని, ఎక్కువ జీవితకాలం ఉంటుందన్న భరోసా లేదని తేలింది.
వీగన్స్ అందరూ సేమ్ డైట్ ఫాలో అవుతారనే రూల్ ఏం లేదు. ఉదాహరణకు.. ఓ వీగన్ తాజా కూరగాయలు, పండ్లు, బీన్స్, పప్పుధాన్యాలు (ప్రోటీన్ కోసం), గింజలు, విత్తనాలు (హెల్తీ ఫ్యాట్ కోసం) తన డైట్‌లో తీసుకుంటే, మరో వీగన్ పాస్తా, టమోటా సాస్, బ్రెడ్ మాత్రమే స్వీకరిస్తాడు. వీగన్స్ తినే ఆహారం పర్సన్, పర్సన్‌కు తప్పకుండా మారుతోంది. ఈ తేడాలు ఆహార నాణ్యతను ప్రభావితం చేయడంతో పాటు, ఆరోగ్యంపైన ఎఫెక్ట్ చూపిస్తాయి. అంతేకాదు ఇండియాలో వీగన్స్ ప్రొడక్ట్స్ వేరు, అమెరికాలో దొరికే వీగన్స్ ప్రొడక్ట్స్ వేరు, ఆయా ప్రొడక్ట్స్ అందించే బ్రాండ్స్ వల్ల ఆయా ఆహారాల్లో మార్పులుంటాయి. ఈ నేపథ్యంలో వీగన్స్ తమ శరీరంలో పోషక లోపాలను నివారించడానికి.. విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తప్పక స్వీకరించాలి. వీగన్స్ తీసుకునే ఆహారం ద్వారా సరైన మోతాదులో విటమిన్ బి 12, ఐరన్ శరీరానికి అందకపోతే అది నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు పూర్తిగా వీగన్ ఫుడ్ స్వీకరించడం వల్ల మెదడు, థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేసే అయోడిన్ లోపానికీ ఆస్కారముందని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వీగన్స్ పెరుగుతున్నప్పటికీ.. ప్రపంచ జనాభాలో వారి సంఖ్య కొద్దిశాతం మాత్రమే. ఇప్పటి వరకు వచ్చిన వీగన్స్ పరిశోధన ఫలితాలు సరైన స్పష్టత ఇవ్వలేదు. వీగన్స్ మొక్కల ఆధారిత ఉత్పత్తులూ స్వీకరిస్తారు. ఇవి చాలా కొత్తవి కావడంతో, వాటి పోషక నాణ్యత ఎంత? ఈ ఉత్పత్తులు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అనే దానిపై సమాచారం లేదు. అందువల్ల వీగన్స్ ఆరోగ్య ప్రభావాలను ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు జరగాలి. అందుకు పెద్ద సంఖ్యలో వీగన్స్ డేటా సేకరించి, మాంసం తినేవారితో పోల్చి చూడాలి. కొద్ది కాలం పాటు ఈ పరిశోధన కొనసాగిస్తే వీగన్స్, నాన్ వెజిటేరియన్స్ మధ్య ఉన్న వ్యత్యాసం, ఆరోగ్య ప్రయోజనాలపై స్పష్టత వస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.