- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎం కిసాన్ స్కీంలో హనుమంతుడు
న్యూఢిల్లీ: హనుమంతుడు, పాకిస్తాన్ గూఢచారి మెహబూబ్ రాజ్‌పుత్, యాక్టర్ రితేశ్ దేశ్‌ముఖ్‌లలో సారూప్యతలేంటి? పీఎం కిసాన్ పథకం ప్రకారం వీరంతా చిన్న రైతులు, సామాజిక భద్రత కోసం కేంద్రం నుంచి నగదు పొందేందుకు దరఖాస్తు చేసి సొమ్ము పొందుతున్నవాళ్లు. టెక్నాలజీలోని లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే హనుమంతుడికి ఆధార్ కార్డును సృష్టించారు. పాక్ గూఢచారి, యాక్టర్ రితేశ్ దేశ్‌ముఖ్‌లనూ రైతులుగా మార్చి విడతల వారీగా పీఎం కిసాన్ స్కీం నగదును జేబులో వేసుకున్నారు. ఇప్పటికీ హనుమంతుడి పేరిట ఆరువేలు, మెహబూబ్ రాజ్‌పుత్ పేరిట నాలుగు వేలు, రితేశ్ దేశ్‌ముఖ్ పేర రెండు వేల రూపాయాలను పొందారు. బహిరంగంగా లభించే వ్యాలిడ్ ఆధార్ కార్డు నెంబర్లనే ఈ స్కామ్‌లకు వినియోగించుకున్నట్టు నిపుణులు తెలిపారు. ఒక వ్యక్తి ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్లు, భూవివరాలతో ఈ మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.