- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రామలింగారెడ్డి ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యం
దిశ, దుబ్బాక : దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలు కొనసాగించాలని ఆయన సతీమణి సుజాతకు టీఆర్ఎస్ టిక్కెట్ ఖరారు చేసినట్లు మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాతను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో.. మంగళవారం చిట్టాపూర్ గ్రామంలో ఆమెను మంత్రి హరీష్ రావు కలిసి ఎన్నికల వ్యూహంపై చర్చించారు. హరీష్ రావు వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, పద్మ దేవేందర్ రెడ్డి లు ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సోలిపేట రామలింగారెడ్డి అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. రామలింగారెడ్డి మరణం చాలా బాధాకరం అని.. ఆయన ఆశయాలను కొనసాగించాలని వారి కుటుంబానికి టిక్కెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో తన కోసం ఇంటింటా ప్రచారం చేసిన వ్యక్తి సోలిపేట సుజాత అన్నారు. సుజాత తనకు చెల్లిలాంటిదని.. తనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.