- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఎస్ఎల్‌లో గోవాకు రెండో విజయం
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21 సీజన్‌లో భాగంగా శనివారం గోవాలోని జీఎంసీ స్టేడియంలో ఒడిశా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో గోవా ఫుట్‌బాల్ క్లబ్ 1-0 తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో గోవా ఎఫ్‌సీకి ఇది రెండో విజయం కావడం గమనార్హం. టాస్ గెలిచిన ఒడిశా జట్టు ఎడమ నుంచి కుడికి ఆడటానికి నిర్ణయించుకుంది. ఇరు జట్లు ఆట మొదటి నిమిషం నుంచి నిరుత్సాహంగా మొదలు పెట్టాయి.
ఫౌల్ ప్లే ఆడుతుండటమే కాకుండా.. బంతిని సరైన దిశకు తరలించడంలో విఫలమయ్యాయి. కాగా 28వ నిమిషంలో ఒడిశా ఆటగాళ్లు ఎటాక్ చేయడం మొదలు పెట్టారు. బ్రెండన్ నుంచి వచ్చిన పాస్‌ను జార్జ్ ఓర్టిజ్ గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. దీంతో గోల్ చేసుకునే అవకాశాన్ని గోవా కోల్పోయింది. ఆ తర్వాత హోరాహోరీగా మ్యాచ్ కొనసాగింది. తొలి అర్దభాగంలోని 45 నిమిషాలు ముగిసిన తర్వాత రిఫరీ 3 నిమిషాల ఇంజ్యురీ టైం కలిపాడు. ఈ సమయంలోనే గోవా ఆటగాడు ఇగొర్ ఆంగ్యులో బంతిని గోల్‌పోస్టులోకి తరలించి గోవాకు 1-0 ఆధిక్యాన్ని తీసుకొని వచ్చాడు.
ఇక రెండో అర్ద భాగంలో ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. నిర్ణీత సమయం ముగిసేసరికి గోవా 1-0 ఆధిక్యంతో నిలిచి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ సీజన్‌లో గోవాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో గోవా టాప్ 4లోకి వెళ్లింది. మరోవైపు ఒడిశా జట్టు వరుసగా మూడో మ్యాచ్ కూడా ఓడిపోయింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు అలెగ్జాండర్ జేసురాజ్, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జార్జ్ మెండోజా గెలుచుకున్నారు.