- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోవా ఎఫ్‌సీకి ఊరట విజయం
దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా బుధవారం రాత్రి ఫర్టోడా స్టేడియంలో ఒడిషా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీ 3-1 తేడాతో విజయం సాధించింది. గత ఐదు మ్యాచ్‌లుగా డ్రాలకే పరిమితం అయిన గోవా ఫుట్‌బాల్ క్లబ్ ఎట్టకేలకు ఊరట విజయాన్ని అందుకున్నది. టాస్ గెలిచిన గోవా జట్టు ఎడమ నుంచి కుడికి ఆడటానికి నిర్ణయించుకున్నది. 18వ నిమిషంలో గోవా ఆటగాడు ఇవాన్ గొన్జాల్వెస్ ఇచ్చిన పాస్‌ను ఆల్బెర్టో నొగూరె గోల్‌గా మార్చాడు. 26వ నిమిషంలో సావియర్ గామా ఇచ్చిన పాస్‌ను జార్జ్ ఆర్టిజ్ గోల్‌గా మలిచి 2-0 ఆధిక్యతను సాధించింది. 30వ నిమిషంలో రాకేష్ ప్రధాన్ ఇచ్చిన గోల్‌ను డియాగో మారిసియో గోల్ చేసి ఒడిషాకు తొలి గోల్ అందించాడు. 75వ నిమిషంలో ఇవాన్ గోన్జాల్వెస్ గోల్ కొట్టి గోవా ఆధిక్యతను 3-1కి పెంచాడు. నిర్ణీత సమయంలోగా మరో గోల్ నమోదు కాకపోవడంతో గోవా ఎఫ్‌సీ 3-1 తేడాతో విజయం సాధించింది. సావియర్ గామాకు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, ఇవాన్ గొన్జాల్వెస్‌కు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.