- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చికిత్సకు వెళ్లి వైద్యురాలిపై అత్యాచారం.. ఆపై నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్
దిశ, వెబ్‌డెస్క్ : ఓ ఐటీ కమిషనర్ దారి తప్పాడు. బాధ్యతలు మరిచి జులాయిగా మారాడు. తనకు చికిత్స చేసిన వైద్యురాలిపైనే లైంగికదాడి చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పుదుచ్చేరికి చెందిన ఓ వ్యక్తి 2019లో నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌లో శిక్షణ తీసుకోవడం కోసం నాగ్ పూర్ వెళ్లాడు. అక్కడ శిక్షణలో భాగంగా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు. ఆ సమయంలో చికిత్స అందించిన వైద్యురాలిలో పరిచయం ఏర్పడింది. ఆ వైద్యురాలు యూపీఎస్పీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పడంతో.. తాను సలహాలు ఇస్తానని ఐటీ కమిషనర్ తన ఫోన్ నంబర్ ఇచ్చాడు.
ఇలా సహాయ పడుతున్నట్లు మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. వైద్యురాలు దానికి అంగీకరించడంతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేయడంతో గర్భవతి అయింది. అయితే అప్పుడు కూడా పెళ్లి చేసుకోకుండా ఆమెకు మాయమాటలు చెప్పి బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఇలా మూడేళ్లుగా పెళ్లి తంతును వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు.
ఇటీవల వైద్యురాలు పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిలదీసింది. దీంతో ఐటీ కమిషనర్ తన కన్నింగ్ తెలివిని బయటపెట్టాడు. వైద్యురాలికి తెలియకుండా శృంగారంలో పాల్గొన్న ఫోటోలను తీసిన అతడు వాటితో బ్లాక్ మెయిల్ చేశాడు. పెళ్లి పేరెత్తితే నగ్న ఫోటోలతో పరువు తీస్తానని, సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వైద్యురాలు నాగ్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బెంగళూర్ లో విధులు నిర్వహిస్తున్న ఐటీ కమిషనర్ పై ఫోక్స్ చట్టంతోపాటు, మోసం, భ్రూణ హత్యపై పలు సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు.