స్తంభించిన జీమెయిల్, గూగుల్ డ్రైవ్

by Anukaran |   ( Updated:2020-08-20 05:16:58.0  )
స్తంభించిన జీమెయిల్, గూగుల్ డ్రైవ్
X

వర్క్ ఫ్రమ్ హోమ్ జమానాలో మెయిల్ సర్వీసెస్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా జీమెయిల్‌ను ఎక్కువగా వాడుతుంటారు. ఒకరోజులో పదుల సంఖ్యలో ఫైళ్లను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు జీమెయిల్ అటాచ్‌మెంట్ సర్వీస్ గానీ, గూగుల్ డ్రైవ్ ఫైల్ అప్‌లోడ్ సర్వీస్ గానీ ఉపయోగిస్తుంటారు. కానీ గురువారం రోజున ఈ రెండు సర్వీస్‌లూ స్తంభించిపోయాయి. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంతకీ వాళ్లకు ఎదురైన సమస్య ఏంటి?

జీమెయిల్ ద్వారా ఒక ఫైల్ పంపించాలంటే దాన్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేయడానికి ముందు అప్‌లోడ్ చేయాలి. అదే ఫైల్ ఒకవేళ 24 ఎంబీ సైజు కంటే ఎక్కువగా ఉంటే దాన్ని గూగుల్ డ్రైవ్‌కు అప్‌లోడ్ చేసుకుని, ఆ తర్వాత లింక్‌ను షేర్ చేసుకోవాలి. కానీ గురువారం రోజున ఈ అటాచ్‌మెంట్ చేయడం సరిగా పనిచేయలేదు. కేబీ సైజులో ఉన్న ఫైల్ కూడా అప్‌లోడ్ అవడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. ఒకవేళ పూర్తిగా అప్‌లోడ్ అయిన తర్వాత కూడా ఫెయిల్ అని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో యూజర్లందరూ సోషల్ మీడియా వారధిగా జీమెయిల్ గురించి ఫిర్యాదులు చేశారు. అధికారిక జీమెయిల్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు చేశారు. అయితే నిజంగానే జీమెయిల్ సర్వీస్‌లో ఏదో అసౌకర్యం ఏర్పడిందని గూగుల్ అంగీకరించింది. సమస్యను గురువారం సాయంత్రంలోగా పరిష్కారిస్తామని హామీ ఇచ్చింది. ప్రపంచమంతటా కాకుండా భారతదేశం, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ దేశాల్లో మాత్రమే ఈ సర్వీస్ స్తంభించిపోయినట్లు విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Next Story