- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్‌కు స్వర్ణం.. ఇది శుభపరిణామం
దిశ, స్పోర్ట్స్: చెస్ ఒలింపియాడ్ (Chess Olympiad) చరిత్రలో భారత్ తొలిసారి స్వర్ణం సాధించడంపై ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక స్పందించారు. ఈ చారిత్రాత్మక విజయం భారత చెస్ భవిష్యత్‌కు గొప్ప సంకేతమని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన హారిక సోమవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘ఈ విజయం అనేకమంది భారత ఆటగాళ్లకు, ముఖ్యంగా యువ ప్రతిభావంతులకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. ఒలింపియాడ్‌లో మా ప్రదర్శన అనంతరం వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగుతుంది. భారత చెస్ భవిష్యత్‌కు ఇదో శుభ పరిణామం’ అని చెప్పుకొచ్చారు.
అలాగే, ఒలింపియాడ్ మెడల్ (Olympiad Medal) సాధించాలన్న తన కల నెరవేరిందని, భారత్, రష్యాలను ఉమ్మడి విజేతలుగా ప్రకటించడం మర్చిపోలేనిదని వెల్లడించారు. కాగా, ఆదివారం జరిగిన ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. విజేతగా నిలిచిన భారత జట్టులో ద్రోణవల్లి హారికతోపాటు విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, హరికృష్ణ, నిహాల్ సరీన్, దివ్య దేశ్ ముఖ్, విదిత్ సంతోష్ గుజరాతీలు సభ్యులుగా ఉన్నారు.