కరోనాపై పోరాటానికి అంతర్జాతీయ నాయకుల లేఖ!

by Harish |
కరోనాపై పోరాటానికి అంతర్జాతీయ నాయకుల లేఖ!
X

దిశ, వెబ్‌డెస్క్: సమస్త మానవాళిని భయపెడుతున్న కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి అంతర్జాతీయ నాయకులు ఏకమయ్యారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక సాయం అవసరమని జీ20 దేశాలకు సూచించారు. ఇప్పటికిప్పుడు కరోనాకు వ్యాక్సిన్ తయారీ కోసం అత్యవసర నిధిగా 8 బిలియన్ డాలర్లను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆరోగ్యవ్యవస్థ సరిగా లేక వెనుకబడిన దేశాలను ఆదుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలు, శాస్త్రవేత్తలు ఆయా దేశాలకు సుమారు 35 బిలియన్ డాలర్లు ఇవ్వాలని కోరారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి సుమారు 150 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని, దీన్ని అధిగమించేందుకు రుణాలు అందుకున్న దేశాలన్నీ తిరిగి చెల్లిస్తే నష్టాన్ని తగ్గించవచ్చని అన్నారు. అలాగే, వెనుకబడిన ఆఫ్రికా దేశాలకు 44 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని దేశాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని లేఖను ఇచ్చినట్టు, మార్చిలో జరిగిన సమావేశంలో పరిస్థితి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితులపై మొత్తం 165 మంది అంతర్జాతీయ నాయకులు, దేశాధినేతలు, మాజీ ప్రధానులు చర్చించినట్టు సమాచారం.

Tags: vaccine, G20, united nations, world bank

Advertisement

Next Story

Most Viewed