- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాసా ప్రాజెక్టుకు గీతం పూర్వ విద్యార్థి ఎంపిక
దిశ, పటాన్‌చెరు: హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో (2017లో) బీటెక్ పూర్తి చేసిన ఘట్టమనేని హేమంత్ నాసాకు ఎంపికయ్యారు. అమెరికాలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రాజెక్టు జియోవేవర్‌లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఎస్ఈ విభాగాధిపతి ఫణికుమార్ శుక్రవారం వెల్లడించారు. హేమంత్ ప్రస్తుతం అమెరికాలోని జార్జ్ మేసన్ విశ్వవిద్యాలయం (జీఎంయూ)లో డేటా సైన్స్‌లో ఎంఎస్ చేస్తున్నాడని, ప్రొఫెసర్ జిహ్నె సన్ ప్రధాన పరిశోధకుడిగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో రీసెర్చ్ అసిస్టెంట్‌గా అవకాశం కల్పించినట్టు తెలిపారు. వచ్చే వేసవిలో నాసా ప్రధాన కేంద్రంలో ఇంటర్న్ షిప్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. హేమంత్ ఎంపిక కావడంపై వర్సిటీ అదనపు ఉపకులపతి శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ సీతారామయ్య, పలువురు అధ్యాపకులు హర్షం వెలిబుచ్చారు.