మోసం చేసిన ప్రియుడు.. ఇంట్లో ముఖం చూపించుకోలేక మైనర్ బలవన్మరణం

by Sumithra |
మోసం చేసిన ప్రియుడు.. ఇంట్లో ముఖం చూపించుకోలేక మైనర్ బలవన్మరణం
X

దిశ, కారేపల్లి: ప్రేమించిన వాడు మోసగించాడని ఓ మైనర్ (17) ప్రాణాలు తీసుకుంది. మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం ఎర్రబోడులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎర్రబోడుకు చెందిన మైనర్‌ బాలికను.. మాణిక్యారం రూప్లాతండాకు చెందిన యువకుడు నూనావత్‌ తారాచంద్‌ ప్రేమిస్తున్నాను అని వెంటపడి మాయమాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాలిక యువకుడిని ప్రేమించింది. తారాచంద్‌ గత రెండేళ్ళుగా ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు.

వీరి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియడంతో బాలికను నిలదీశారు. దీంతో బాలిక.. తారాచంద్‌ను పెండ్లి చేసుకుందామని వేడుకోగా ప్రియుడు హ్యాండిచ్చాడు. దీంతో తల్లిదండ్రులకు ఎలా ముఖం చూపించాలో తెలియక, తీవ్ర మనస్థాపంతో ఈ నెల 28వ తేదిన ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలికను ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. బాలిక తండ్రి వీరస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story