యువతి ఆత్తహత్య..

దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. ఉండవల్లికి చెందిన చాందిని (18) అనే యువతి ఇంట్లోని సమస్యల వలన మసస్థాపానికి గురైంది.

ఈనేపథ్యంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు.

Advertisement