నెల్లూరులో కిడ్నాప్ కలకలం..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కొడవలూరు మండలం కొత్తవంగల్లుకు చెందిన స్వర్ణ శ్రీనివాస్ అనే అమ్మాయి ఇవాళ కనిపించకుండా పోయింది. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రేమించిన వాడే తమ ఇంటి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement