చికిత్స పొందుతూ బాలిక మృతి

by  |
చికిత్స పొందుతూ బాలిక మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్:
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లో కెళితే…. బోదన్ మండలంలోని కోప్పర్గ గ్రామానికి చెందిన నాగేశ్వరి(11) కు జాండీస్ వచ్చింది. దీంతో నగరంలోని పలు ఆస్పత్రుల్లో ఆమెకు తల్లిదండ్రులు వైద్యం చేయించారు. అయినప్పటికీ జాండీస్ తగ్గకపోవడంతో సాయి ప్రసాద్ పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పాప పరిస్థితి విషమంగా ఉందని హైద్రాబాద్ కు తరలించే ఎర్పాట్లు చేస్తుండగానే నాగేశ్వరి బుధవారం మృతి చెందింది. దీంతో ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యులు భైఠాయించి నిరసన తెలిపారు. కాగా తమ వద్ధ గ్యారంటీ వైద్యం అని చెప్పి సాయి ప్రసాద్ ఆస్పత్రిలో తమ కూతురును వైద్యులు చేర్చుకున్నారని తల్లి దండ్రులు తెలిపారు. అడ్వాన్స్ కింద 3వేలు, బిల్లు కింద మరో 20వేలు వసూలు చేశారని తెలిపారు. ఆ తర్వాత మీ కూతురు పరిస్థితి విషమంగా ఉందనీ, పట్నం తీసుకు పోవాలని వైద్యులు చెప్పినట్టు వారు తెలిపారు. దీంతో ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే బాలికకు లివర్ చెడిపోయిందనీ, గ్యారంటీ ఇవ్వలేమని సంతకం చేయించుకున్న తర్వాతే వైద్యం చేసినట్టు వైద్యుడు సాయి ప్రసాద్ చెప్పారు. కాగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కుటుంబ సభ్యులను సముదాయించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed