- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరాజ్, సైనీలకు గిల్‌క్రిస్ట్ క్షమాపణ
దిశ, స్పోర్ట్స్: ఆసీస్ మాజీ క్రికెటర్, టీవీ వ్యాఖ్యాత అడమ్ గిల్ క్రిస్ట్ టీమ్ ఇండియా పేసర్లు మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీలకు క్షమాపణలు చెప్పాడు. శుక్రవారం సిడ్నీలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేకు గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యాతగా ఉన్నాడు. టీమ్ ఇండియా బౌలింగ్ చేసే సమయంలో నవదీప్ సైనీని ఉద్దేశించి.. ఇటీవల అతడి తండ్రి మరణించినా ఆటకోసం ఇక్కడ ఉండిపోయాడు అని వ్యాఖ్యానించాడు.
అయితే ఈ పొరపాటును ఒక అభిమాని ట్విట్టర్ ద్వారా గిల్‌క్రిస్ట్‌కు తెలియజేశాడు. మరణించింది సైనీ తండ్రి కాదని మహ్మద్ సిరాజ్ తండ్రి అని.. తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని సూచించాడు. వెంటనే స్పందించిన గిల్‌క్రిస్ట్ తన తప్పును అంగీకరించాడు. సిరాజ్, సైనీలను క్షమాపణ కోరాడు. ఈ మేరకు గిల్‌క్రిస్ట్ ట్వీట్ చేశాడు. గిల్లీ పొరపాటును గమనించిన సహచర వ్యాఖ్యాత మిచెల్ మెక్‌క్లేగన్ పొరపాటును సరిచేస్తూ ఫాక్స్ టీవీ ట్విట్టర్‌లో మెసేజ్ చేశాడు.