- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్-19 అరికట్టేందుకు 12 కంటైన్‌మెంట్ క్లస్టర్స్
– ఆరు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు
దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19 వ్యాప్తి నివారణలో భాగంగా.. నగరంలో 12 కంటైన్‌మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. బుధవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌గా నమోదైన 89 కేసులు ఈ క్లస్టర్లలోనే ఉన్నట్లు కమిషనర్ వివరించారు. కంటైన్‌మెంట్ క్లస్టర్లలో శానిటేషన్, క్రిమిసంహారక ద్రావణాల స్ప్రేయింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రతి క్లస్టర్‌లో ఉన్న ఇండ్లను వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ బృందాలు రెగ్యులర్‌గా సందర్శిస్తూ.. కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి వైద్యపరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు. క్లస్టర్‌లలో పటిష్టమైన బారికేడింగ్‌తో ప్రజల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌తో చర్చించినట్లు తెలిపారు. మర్కజ్ నుంచి వచ్చిన 593 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో 63 మందికి కరోనా పాజిటివ్ రాగా, వారి ద్వారా మరో 45 మంది కుటుంబ సభ్యులకు సోకినట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా 330 మొబైల్ రైతు బజార్లను స్థానికంగా అందుబాటులోకి తేవడంతో పాటు వలస కార్మికులకు 12 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని, రూ. 500 నగదును పంపిణీ చేసినట్లు తెలిపారు. 3,400 మంది నిరాశ్రయులను గుర్తించి, వారికి 14 నైట్ షెల్టర్లతో పాటు 12 తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేశామన్నారు. వర్తక, వ్యాపార, విద్యాసంస్థలు, పరిశ్రమలు మూత పడడంతో ఎటువంటి ఆధారంలేని వ్యక్తులకు అన్నపూర్ణ పథకం ద్వారా మధ్యాహ్నం పూట 55 వేలు, రాత్రి పూట 35వేల మందికి ఉచితంగా రెండు పూటల భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో నెలకొల్పిన ప్రత్యేక విభాగం ద్వారా దాతల సహకారంతో పది మొబైల్ వాహనాల ద్వారా 17 వేల ఆహార ప్యాకెట్లను సేకరించి, సర్కిల్ కార్యాలయాల నుంచి గుర్తించిన వారికి అందజేస్తున్నట్లు తెలిపారు. నగరంలో దాదాపు 400 లొకేషన్లలో స్వచ్చందంగా ఆహారాన్ని అందించుటకు ముందుకు వచ్చిన 145 మంది దాతలకు పాస్‌లు జారీచేసినట్లు వెల్లడించారు.
కొవిడ్-19 నేపథ్యంలో రీయూజబుల్‌గా ఉండే 60 వేల క్లాత్ మాస్కులను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల ద్వారా కుట్టిస్తున్నట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులతో పాటు స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, సహాయకులకు కూడా రెండు చొప్పున మాస్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఏప్రిల్ నెలలో ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే గ్లౌసులు, మాస్కులు, షూ, సోప్స్, ఇతర ప్రధానమైన వస్తువుల కిట్‌లను అందజేసేందుకు ఆర్డర్ చేసినట్లు, వారం పదిరోజుల్లో ప్రతి కార్మికుడికి ప్రత్యేకమైన హెల్త్ కిట్ అందించనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే పారిశుధ్య కార్మికుల సౌకర్యార్థం 34 బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక దూరాన్ని పక్కాగా అమలు చేసేందుకు బస్సుల్లో వాలంటీర్‌ను నియమించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
Tags: Covid 19, Isolation Centres, GHMC, Night Shelter