- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ ప్రకటనలకు జీహెచ్ఎంసీకి సంబంధం లేదు: ఎస్ఈసీ

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆస్తులపై పార్టీ తరుపున ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని బస్ షెల్టర్లు, మరుగుదొడ్లను ప్రైవేట్ ఎజెన్సీలతో నిర్మించారని వెల్లడించింది. సొంత ఖర్చులతో వీటిని నిర్మాణం చేస్తారని, జీహెచ్ఎంసీకి వార్షిక లైసెన్స్ ఫీజులను చెల్లిస్తారని, ప్రకటనల ద్వారా పెట్టుబడిని పొందుతాయని ఎస్ఈసీ పేర్కొంది. ప్రకటనలకు ఎజెన్సీలదే హక్కు ఉంటుందని, జీహెచ్ఎంసీకి ఎలాంటి హక్కు ఉండదని, ప్రైవేట్ ఎజెన్సీలతో ఒప్పందం చేసుకుని ఎవరైనా ప్రకటనలు చేసుకోవచ్చని తెలిపింది. మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టు అని, ఈ నిర్మాణాలపై హక్కులు ఎల్అండ్టీకి ఉన్నాయని, దానిపై ప్రభుత్వ అనుమతి ఉండదన్నారు. అయితే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటనల కోసం ఎజెన్సీలను సందర్శిస్తే అన్ని పార్టీలు, అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని ఎజెన్సీలకు ఆదేశించినట్లు ఎస్ఈసీ వెల్లడించింది.