మహిళలను వేధించేందుకు కొత్త సాఫ్ట్‌వేర్

దిశ, వెబ్‌డెస్క్: చదివింది ఐదో తరగతి అయినా.. 500 మహిళలను వేధించాడు. ఆండ్రాయిడ్ మొబైల్ చేతిలో ఉందని అసభ్యకర పనులు చేశాడు. అతడి వేధింపులతో బాధిత మహిళలు ఎంతో ఆవేదనకు గురైనా.. అతడెవరో తెలియలేదు. ఎందుకంటే తన నెంబర్ గుర్తించకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉపయోగించడంతో నిందితుడి ఆచూకీ తెలియలేదు. అయినా.. నెల రోజుల పాటు నిఘా వేసిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కాగా, ఓ మహిళా లాయర్ ఫిర్యాదుతో అతడి భాగోతం బయటపడింది.

హర్యానాకు చెందిన 22 ఏండ్ల యువకుడు అమ్మాయిలకు అసభ్యకర మేసేజ్‌లు, చిత్రాలు పంపుతు పైశాచిక ఆనందం పొందడం అలవాటు చేసుకున్నాడు. చదివింది ఐదో తరగతి అయినా.. ఫోన్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ వేసుకొని తన నెంబర్ ఎవరు కూడా గుర్తించకుండా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఏదో ఒక నెంబర్‌కు డయల్ చేసి.. కాల్ మాట్లాడేవారు యువతి, మహిళ అయితే ఆ నెంబర్ సేవ్ చేసుకునేవాడు. ఆ తర్వాత అసభ్యకరమైన మేసేజుల చేస్తూ వేధింపులు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళకు కాల్ చేసి మరింత విసిగించాడు. బాధితురాలు మహిళా లాయర్ కావడం గమనార్హం. దీంతో అతడి వేధింపులు భరించలేక ఘజియాబాద్ సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నెంబర్ ట్రాప్ చేయడం కఠినతరం అయింది. సౌత్ కొరియా, ఫిలిప్పిన్స్‌ దేశాలకు చెందిన నెంబర్లతో కాల్స్ రావడం మరింత తలనొప్పిగా మారింది. అయినప్పటికీ ఐపీ అడ్రస్‌తో నెల రోజుల పాటు ఆరా తీసిన పోలీసులు నిందితుడు హర్యానా వాసిగా గుర్తించారు.

అనంతరం అదుపులోకి తీసుకొని ఫోన్‌ను పరిశీలించగా.. ఏకంగా 500 మహిళలు నెంబర్లు, చాటింగ్ వివరాలు బయటపడ్డాయని ఘజియాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కళానిధి నైథాని వివరణ ఇచ్చారు. బాధితులు హర్యానా, ఢిల్లీ, యూపీ, పంజాబ్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వారిగా విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడు గతంలో చేసిన నేరాల పై కూడా ఆరా తీస్తున్నట్లు కళానిధి నైథాని తెలిపారు.

Advertisement