గట్టుపల్‌లో చేనేతల దీక్ష విరమణ

by Shyam |
గట్టుపల్‌లో చేనేతల దీక్ష విరమణ
X

దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా గట్టుపల్ గ్రామంలో 11 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షను చేనేతలు విరమించారు. టీఆర్‌ఎస్ నేత, కేటీఆర్ సన్నిహితుడు కర్నాటి విద్యాసాగర్ విజ్ఞప్తి మేరకు చేనేతలు దీక్షలు విరమించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ.. కరోనాతో చేనేత బతుకులు అల్లకల్లోలం అయిందన్నారు. సహకార సంఘాల వద్ద పేరుకుపోయిన చేనేత వస్త్రాల కొనుగోలుపై కేటీఆర్‌తో చర్చిస్తానని ఆయన చేనేతలకు హామీ ఇచ్చారు.

గట్టుపల్ గ్రామం త్వరలో మండల కేంద్రంగా ఏర్పాటు అవుతుందన్నారు. తన మాటపై నమ్మకంతో దీక్ష విరమించిన చేనేత ఐక్య కార్యాచరణ సమితికి విద్యాసాగర్ ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Next Story