డిప్రెషన్ ను ఎదుర్కొనే అత్యుత్తమ చిత్రమే.. ‘కాసవ్ ’

by Prasanna |   ( Updated:2021-10-17 03:43:54.0  )
డిప్రెషన్ ను ఎదుర్కొనే అత్యుత్తమ చిత్రమే.. ‘కాసవ్ ’
X

దిశ, ఫీచర్స్ : ‘మనిషికి ఫెయిల్యూర్స్ కామన్ కానీ అవి జీవితాన్ని తలకిందులు చేస్తే తట్టుకోలేం. నమ్మినవారే ద్రోహం చేస్తే ఆ బాధను భరించలేం. ఫేక్ లవ్.. ఫెయిల్యూర్ గోల్.. సమస్య ఏదైనా వెంటాడే ఆలోచనలు.. తిండి, నిద్రలేని రాత్రులు.. కదిలిస్తే తన్నుకొచ్చే దు:ఖం.. నాకే ఎందుకిలా జరుగుతోందన్న అంతర్మథనం.. పనిమీద ధ్యాస ఉండదు.. పరిష్కారం అసలే దొరకదు.. పక్కకు తప్పుకునేందుకు ధైర్యం రాదు.. అప్పుడనిపిస్తుంది.. దీనమ్మా జీవితం! చచ్చిపోవడం బెటర్ కదా అని.. ఈ డిప్రెషన్ నుంచి పుట్టుకొచ్చేవే సూసైడికల్ థాట్స్ లేదంటే యాంగ్జైటీ స్టార్ట్’. వీటిని ఎదుర్కొనేందుకు ‘మాస్టర్ క్లాస్‌’లా ముందుకొచ్చిన మరాఠీ చిత్రమే ‘కాసవ్’. సింపుల్ బట్ సర్‌ప్రైజింగ్ స్టోరీ అండ్ స్క్రీన్‌ప్లేతో గోల్డెన్ లోటస్ అవార్డు అందుకున్న మూవీ హాలీవుడ్ మేకర్స్ అప్రిసియేషన్ కూడా అందుకుంది.

అసలు స్టోరీ ఏంటంటే..
చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన మానవ్, తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో స్టెప్ మదర్ దగ్గర ఉండటం ఇష్టం లేక నానమ్మ-తాతయ్యలతోనే లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. అయితే ఆరు నెలల గ్యాప్‌లోనే ఇద్దరూ చనిపోవడంతో ఒంటరితనంలో కూరుకుపోయిన మానవ్, ఆ ప్లేస్‌‌లో లోన్లీనెస్‌ భరించలేక తను రాసుకున్న డైరీ, దుస్తులున్న బ్యాగ్‌ భుజాన వేసుకుని ఊర్లన్నీ తిరుగుతుంటాడు. ఒకానొక దశలో ప్రపంచంలో తానొక్కడినే దురదృష్టవంతుడినని, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ మోసం చేశారనే ఆలోచనతో సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. ఇది గమనించిన స్థానికులు హాస్పిటల్‌లో చేర్చినా, అక్కడ ఉండటం ఇష్టంలేక పారిపోతాడు. అలా తిరుగుతూ తిరుగుతూ కసూర్‌లోని ఓ లారీల అడ్డా దగ్గర స్పృహ లేకుండా పడిపోతాడు. అప్పుడప్పుడే డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి హీల్ అవుతున్న జానకి అనే పెద్దావిడ చూస్తుంది.

తను కూడా డిప్రెషన్‌లో ఉన్నాడని గ్రహించిన ఆమె, తనలాంటి బాధను ఎదుర్కొంటున్న మానవ్‌ను తనతో పాటు ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ మానవ్ జానకమ్మను ఎలా టార్చర్ చేశాడు? అయినా సరే ఆమె ఎందుకు అదంతా భరించింది? తనను డిప్రెషన్ నుంచి క్యూర్ చేసేందుకు ఏ విధానాన్ని ఎంచుకుంది? వీరిద్దరికి నేచర్ ఎలా హెల్ప్ చేసింది? ముందు జానకమ్మను చూస్తేనే తనపై పెద్దరికం చేయొద్దని ఇరిటేట్ ఫీలైన మానవ్, ఆ తర్వాత జానకమ్మకు కొడుకుగా ఎలా మారిపోయాడు? తాబేలు కథ చెప్పి మానవ్‌ను మెప్పించిన జానకమ్మ, తను కూడా తాబేలు మాదిరిగానే బిడ్డ(మానవ్‌)ను వదిలేసిందా? లేక లైఫ్ లాంగ్ తనకు అండగా నిలిచిందా? ఇంతకీ జానకమ్మ డిప్రెషన్‌కు కారణమేంటి? అనేది కథ.

అప్రిసియేషన్..
మాస్టర్ స్టోరీటెల్లర్స్ సుమిత్రా భావే, సునీల్ సూక్తంకర్ గురించి మాటల్లో చెప్పలేం. వారి మేకింగ్‌లో ప్రతీ అంశానికి ఒక యూనిక్ స్టోరీ ఉంటుంది. డ్రామా పీక్‌లో ఉన్నప్పటికీ, ప్రతీది సెటిల్‌గానే కనిపిస్తుంది. కథలో విస్ఫోటనం కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సినిమాలో కనిపించే మల్టిపుల్ వైడ్ షాట్స్ నేచర్ గ్లోరీ, హీలింగ్ ప్రాసెస్‌ను హైలెట్ చేశాయి. సినిమాటోగ్రాఫర్లు ధనంజయ్ కులకర్ణి, అమోల్, కెమెరాను యూజ్ చేసిన విధానం ఉత్తమమైనది కాగా, సముద్రంతో అనుబంధం, అడవులతో అన్యోన్యతను అమేజింగ్‌గా క్యాప్చర్ చేశారు.

యాక్టర్స్‌ను ఫాలో అయ్యే హ్యాండ్‌హెల్డ్ షాట్స్ సినిమాకు డాక్యుమెంటరీ వైబ్‌ను తీసుకొచ్చాయి. సాకేత్ అందించిన సూటింగ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ కాగా, ఆయన సింగింగ్ ఓ ట్రీట్‌లా ఉంటుంది. అలోక్ రాజ్‌వాడే, ఇరావతి తమ తమ పాత్రలకు ప్రాణం పోయగా, వీరిద్దరూ కలిసి ఉన్న ప్రతీ ఫ్రేమ్ ఫుల్‌ఫిల్డ్‌గా కనిపిస్తుంది. ఇక యాదుగా కిశోర్ కదమ్ బ్యూటిఫుల్ వైబ్ తీసుకురాగా, లిటిల్ ఓంకార్ ఘడి అడోరబుల్‌ కిడ్‌గా మెప్పించాడు.

రైజింగ్ పాయింట్స్..
1. మనిషి ఉనికి కోసం ధ్రువీకరణ కోరుతూ ఓదార్పు, ఆశ్రయం పొందుతున్నాము
2. ప్రతీ ఒక్కరికి ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్
3. ఒకరి అనుభవం మరొకరికి దారి చూపాలి
4. డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి బయటపడటం కష్టమేమో కానీ అసాధ్యమైతే కాదు
5. మన ప్రయాణంలో తారసపడిన ప్రతీ ఒక్క మనిషి ఏదో ఒక పాఠం చెప్తూనే ఉంటాడు
6. మన అనే మనుషులను సంపాదించుకోవడం, దూరం చేసుకోవడం రెండూ కష్టమే
7. అమ్మ పాత్ర గొప్పది.. పక్కనే లేకపోయినా బిడ్డకు సురక్షిత వాతావరణం సృష్టించగలదు

Advertisement

Next Story