- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన జర్మనీ
by Shyam |

X
దిశ, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్ 2022కి అర్హత సాధించిన తొలి జట్టుగా జర్మనీ రికార్డు సృష్టించింది. సోమవారం రాత్రి యూఈఎఫ్ఏ గ్రూప్ జేలో భాగంగా నార్త్ మాసిడోనియాతో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 4-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. జర్మనీ స్ట్రైకర్ టిమో వెర్నర్ రెండు గోల్స్ సాధించగా కాల్ హావెర్జ్, జమాల్ ముసియలా చెరో గోల్స్ చేశారు. దీంతో పర్యాటక జర్మనీ ఆతిథ్య నార్త్ మాసిడోనియాను 4-0తో ఓడించి ఫిఫా వరల్డ్ కప్ 2022కు అర్హత సాధించింది. ఫిఫా వరల్డ్ కప్‌లో మొత్తం 32 జట్లు పాల్గొన నున్నాయి. ఆయా ఖండాలకు సంబంధించిన క్వాలిఫయర్ మ్యాచ్‌లు ప్రస్తుతం జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు ఖతర్ వేదికగా వరల్డ్ కప్ జరుగనున్నది.
Next Story