గ్రామీ ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’.. జార్జ్ ఫ్లాయిడ్ ఆంథెమ్

by Jakkula Samataha |   ( Updated:2021-03-15 03:05:46.0  )
గ్రామీ ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’.. జార్జ్ ఫ్లాయిడ్ ఆంథెమ్
X

దిశ, సినిమా : అమెరికాలో గతేడాది మే 25న శ్వేతజాతి పోలీస్ అధికారి చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ పేరుతో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ భయంకరమైన సంఘటన ఆధారంగా అమెరికన్ సింగర్ గేబ్రియల్ సర్మిలెంటో విల్సన్ (H.E.R) రూపొందించిన ‘ఐ కాంట్ బ్రీత్’ అనే పాట హ్యూజ్ సక్సెస్ సాధించింది. తాజాగా నిర్వహించిన 63వ గ్రామీ అవార్డుల వేడుకల్లో ఈ పాటకు ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ దక్కింది. ప్రపంచ పాపులర్ సింగర్స్ ‘బియాన్స్, టేలర్ స్విఫ్ట్, బిల్లీ‌ ఐలిష్’తో పోటిపడి మరి అవార్డును సొంతం చేసుకున్న గేబ్రియల్.. ఈ అవార్డును కో రైటర్స్ డెస్ట్ ఎమైల్, తియారా థామస్‌లతో పంచుకుంది. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మనలో పోరాటపటిమను పెంచి, అందుకు తగ్గ శక్తిని అందిస్తుంది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story