అందోల్ పూర్వ విద్యార్థుల ఔదార్యం..!

దిశ‌, అందోల్: స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. అన్న అక్ష‌ర స‌త్యాన్ని నిజం చేశారు అందోల్ పూర్వ విద్యార్థులు. స్నేహితురాలి కూతురికి ఆరోగ్యం బాగోలేక‌పోతే మెరుగైన వైద్య చికిత్స‌ల నిమిత్తం ఆర్థిక సహాయం అందించి తామున్నామంటూ భరోసానిచ్చారు. సంగారెడ్డి జిల్లా అందోల్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 1993నాటి టెన్త్ బ్యాచ్ ఎక్కడెక్కడో స్థిరపడి.. అప్పుడప్పుడు కలుసుకుంటున్నారు. ప్యారాథైరాయిడ్ జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న త‌మ‌ స్నేహితురాలు టీ. జ్యోతి రెండో కూతురు లక్ష్మీ ప్ర‌ణ‌వికి ఇటీవ‌ల శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. వారి ఆర్థిక ప‌రిస్థితిని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు సోమ‌వారం అందోలులోని ఆమె ఇంటికి వెళ్లి రూ.ల‌క్ష న‌గ‌దును అందించారు.

Advertisement