జన్యువుల పేర్లు మార్చారు

by  |
జన్యువుల పేర్లు మార్చారు
X

మానవ జీనోమ్‌లో కొన్ని వేల జన్యువులు ఉంటాయి. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ రూపాల్లో ఒక్కోదానికి ఒక్కో లక్షణం ఉంటుంది. కాబట్టి ఆంగ్ల అక్షరాలు, అంకెలతో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకమైన పేరును పెట్టారు. అయితే, వాటి పేర్లను పూర్తిగా ఎక్సెల్ షీట్‌లో రాయడం కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయమే. కాబట్టి షార్ట్ రూపాలను ఉపయోగిస్తారు. ఈ రూపానికి సింబల్ అని పేరు పెట్టారు. ఈ సింబల్‌లు మొత్తం అందరు శాస్త్రవేత్తలకు తెలిసి ఉంటుంది. అయితే, గతేడాది నుంచి ఒక 27 జన్యువులతో పెద్ద సమస్య ఏర్పడుతోంది. అందుకు కారణం ఎంఎస్ ఎక్సెల్. జన్యువుల షార్ట్ రూపాలను ఎంఎస్ ఎక్సెల్ నెలలుగా పరిగణించి, వాటి ఫార్మాట్‌ను ఆటోమేటిక్‌గా మారుస్తోంది. దీని వల్ల జన్యు సంబంధ అధ్యయనాల్లో పెద్ద పెద్ద తప్పిదాలు జరుగుతున్నాయి.

మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో ఇలా ఆటోమేటిక్ ఫార్మాటింగ్ డీఫాల్ట్‌గా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఒక్కొక్క కాలమ్ దగ్గరికి వెళ్లి విడివిడిగా ఫార్మాట్ రకాన్ని మార్చాలి. అలా మార్చిన ఫైల్‌ను వేరే వాళ్లకి పంపితే వ్యవహారం మళ్లీ మొదటికే వస్తుంది. కాబట్టి శాస్త్రవేత్తల్లో లెక్కల్లో చాలా తేడాలు వస్తున్నాయి. ఈ సమస్య నుంచి గట్టించడానికి హ్యూగో జీన్ నామినిక్లేచర్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది. ఎలాగూ ఎక్సెల్ సెట్టింగ్‌లు ప్రత్యేకంగా మార్చలేం కాబట్టి ఇబ్బంది కలిగిస్తున్న ఆ 27 జన్యువుల పేర్లను మార్చాలని నిర్ణయించుకున్నారు. మార్చ్1 అని పేరు ఉన్న జన్యువును మార్చ్‌ఎఫ్1గా, సెప్ట్1 అని సింబల్ ఉన్న జన్యువును సెప్టిన్1గా మార్చారు. ఇలా 27 జన్యువుల పేర్లకు ఏదో ఒక కొత్త తోకను తగిలించి సింబల్ మార్చారు.


Next Story

Most Viewed