12వ గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్న శివాలి కుటుంబం

by Shyam |
12వ గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్న శివాలి కుటుంబం
X

దిశ, పటాన్‌చెరు: హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ కుటుంబం పన్నెండో గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు. చేతితో రూపొందించిన 1,988 ఆరెగామి మాషీ లీవ్స్‌ను ఒకేచోట ఉంచి.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు. చిన్నపాటి రంగు కాగితాన్ని కూడా కళాత్మకంగా మార్చగలిగే నేర్పు శివాలి కుటుంబానికి వరంగా మారింది. ఒకటి… రెండు కాదు, ఏకంగా పన్నెండు గిన్నిస్ రికార్డులు, 15 ఆసిస్ట్ వరల్డ్ రికార్డులతో పాటు ఒక యూనిక్ వరల్డ్ రికార్డు శివాలి కుటుంబం సొంతం చేసుకుంది.

గతంలోనూ హ్యాండ్ మేడ్ పేపర్‌తో రూపొందించిన 1,251 విభిన్న బొమ్మలను కొలువు తీర్చి తొలి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఆ తరువాత 7,011 విభిన్న కాగితం పువ్వులను ప్రదర్శించి రెండో రికార్డు సాధించింది. ఇప్పటివరకు పదకొండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది. దీంతో గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ తదితరులు అభినందించారు.

Advertisement

Next Story