- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంపన్నుల జాబితాలో స్థానం చేజార్చుకున్న అదానీ
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఆసియాలోనే రెండో అత్యధిక సంపన్నుడిగా ఎదిగిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన స్థానాన్ని చేజార్చుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో గౌతమ్ అదానీ సంపద భారీగా తగ్గిపోవడంతో ఆయన స్థానంలో చైనాకు చెందిన సంపన్నుడు జాంగ్ షంషాన్ ఆసియా రెండో అత్యంత సంపన్నుడిగా ఎదిగారని గ్లోబల్ ఇండెక్స్ తాజా జాబితా స్పష్టం చేసింది. ఇటీవల అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు కలిగిన మూడు విదేశీ కంపెనీలకు చెందిన ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయనే వార్తలతో అదానీ సంపద ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అదానీ సంపద ఏకంగా రూ. 55 వేల కోట్లకు పైగా పడిపోయింది. దీంతో ఆయన రెండో స్థానం నుంచి దిగజారారని గ్లోబల్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఆసియా అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
Next Story