- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారిని కూడా మించి.. టాప్ 20 బిలినియర్‌గా అదానీ
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్స్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అరుదైన ఘతనను దక్కించుకున్నారు. ప్రపంచంలోనే టాప్ 20 బిలినియర్స్ జాబితాలో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా ప్రపంచంలోనే టాప్ 20 బిలినియర్స్ జాబితాను ప్రకటించింది. ఇందులో తొలిసారి అదానీ చోటు దక్కించున్నారు.
గత సంవత్సరకాలంలో ఇండియాలో ఎక్కువగా సంపాదించిన వ్యక్తి అదానీనేనని ఫోర్బ్స్ పేర్కొంది. ఆయన నికర ఆస్తుల విలువ 59.9 బిలియన్ యూఎస్ డాలర్లుగా తేల్చింది. 2020లో ఆయ నికర ఆస్తుల విలువ 16.2 బిలియన్ యూఎస్ డాలర్లుగా మాత్రమే ఉందని, ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయాయని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సర కాలంలో అదానీ గ్రూప్‌కి చెందిన అదానీ పవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్ షేర్లు 50 శాతం పెరగడమే ఆయన ఆస్తుల విలువ పెరగడానికి కారణమని స్పష్టం చేసింది.
2021లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన జెఫ్ బెజోస్, ఎలాన్ మాస్క్ కంటే అదానీ ఎక్కువ సంపాదించారని ఫోర్బ్స్ చెప్పింది. అదానీ గ్రూప్స్ చాలా రంగాల్లో తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మైనింగ్, పోర్ట్స్, పవర్ ప్లాంట్స్, ఎయిర్‌పోర్ట్స్, డేటా సెంటర్స్, డిఫెన్స్ రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపారం చేస్తోంది.