రియల్ ఎస్టేట్ కంపెనీ నిధుల దుర్వినియోగం

by  |
రియల్ ఎస్టేట్ కంపెనీ నిధుల దుర్వినియోగం
X

దిశ, వెబ్‌డెస్క్: నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ సంస్థ గౌర్‌సన్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. సుమారు రూ. 80 కోట్ల మోసాలకు పాల్పడినట్టు సీబీఐ అభియోగం మోపింది. గౌర్‌సన్స్ ఛైర్మన్ బీ ఎల్ గౌర్, ఆయన భార్య నవనీత్, కుమారుడు రాహుల్ గౌర్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంకుల నుంచి రూ. 80 కోట్లను మోసం చేశారని అధికారులు తెలిపారు.

ఇందులో..నొయిడాలో ఉన్న లగ్జరీ అపార్ట్‌మెంట్‌తో ఉన్న హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించడానికి గౌర్‌సన్స్ కంపెనీ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 150 కోట్లను, సిండికేట్ బ్యాంక్ నుంచి రూ. 100 కోట్లు మొత్తం రూ. 250 కోట్లను తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. కానీ, దశల వారీగా చెల్లించడకుండా, ప్రాజెక్ట్ ప్రారంభంలోనే నిలిచిపోయిందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాడు పేర్కొంది. అబద్దపు వివరాలు, లెక్కలు చూపించి, ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్టుగా అవాస్తవాలను చూపించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఫిర్యాదులో వెల్లడించారు.



Next Story

Most Viewed