- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2021లో పెరగనున్న భారత ఐటీ వ్యయం
దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్, ఐటీ సేవల వంటి విభాగాల్లో వృద్ధి నేపథ్యంలో ప్రస్తుత ఏడాదితో పోల్చితే 2021లో భారత్‌లో ఐటీ వ్యయం 6 శాతం పెరిగి సుమారు రూ. 6 లక్షల కోట్లకు చేరుకుంటుందని పరిశోధనా సంస్థ గార్ట్‌నర్ సోమవారం వెల్లడించింది. 2020లో ఐటీ వ్యయం మొత్తం రూ. 5.8 లక్షల కోట్లుగా ఉండగా, 2019లో 8.4 శాతం తక్కువగా నమోదైంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా భారత సంస్థల డిజిటల్ ప్రాజెక్టులను నిలిపేసింది.
ప్రధానంగా మర్కెట్లలో అనిశ్చితి, నగదు ప్రవాహం తగ్గిందని గార్ట్‌నర్ పరిశోధనా ఉపాధ్యక్షుడు అరుప్ రాయ్ చెప్పారు. కరోనా మహమ్మారి పరిస్థితులను అనుసరించి అనేక సంస్థలు తమ ఐటీ వ్యూహాలను పునఃపరిశీలించి, పునరుద్ధరించాలని, 2021లో ఐటీ విభాగంపై వారి ఖర్చులను పెంచాలని అరుప్ రాయ్ పేర్కొన్నారు. 2020లో పరికరాలు, డేటా సెంటర్ వ్యవస్థలు బాగా క్షీణించాయి. ఖర్చులు 26 శాతం, వ్యయం 1.2 శాతం పడిపోయాయని అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు.
గత సంవత్సరంతో పోలిస్తే 2020లో సాఫ్ట్‌వేర్ ఖర్చులు 7 శాతం, ఐటీ సేవల ఖర్చులు 3.7 శాతం, కమ్యూనికేషన్ సేవల ఖర్చులు 4.9 శాతం పెరుగుతాయని గార్ట్‌నర్ సంస్థ తెలిపింది. అన్ని విభాగాలు ఖర్చుల్లో పెరుగుదలను చూస్తుండగా, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ విభాగం అత్యధికంగా 13.6 శాతం వృద్ధిని సాధిస్తుందని, దీని తర్వాత డేటా సెంటర్ విభాగం 8.3 శాతం ఉన్నట్టు పేర్కొంది. డిజిటల్ ఇండియా ప్రచారం నేపథ్యంలో వచ్చే ఏడాది అన్ని రంగాల్లోని సంస్థలు ఐటీ విభాగం కోసం అధికంగా ఖర్చు చేస్తాయని అరుప్ రాయ్ చెప్పారు.