వెల్లుల్లి.. గుడ్ టు హెల్త్

by  |
వెల్లుల్లి.. గుడ్ టు హెల్త్
X

దిశ, వెబ్ డెస్క్: మన వంటింట్లో ఉండే వెల్లుల్లి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి ముక్కు, గొంతు సంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది. వెల్లుల్లిపై బ్రిటీష్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 146 మంది ఆరోగ్యవంతుల్ని 12 నెలలపాటు పరీక్షించారు. రోజూ వెల్లుల్లిని తీసుకునే వారికి జలుబు తొందరగా రాదని గుర్తించారు.

వెల్లుల్లిలోని పోషకాలు..

వెల్లుల్లి వాసన కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అది కూరలకు ప్రత్యేక రుచిని ఇస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సీ, విటమిన్ బీ6, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇది సైనస్‌తో కూడా పోరాటం చేస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను, వైరల్ సమస్యలను ఎదుర్కోవడంలో వెల్లుల్లి ముందుంటుంది. రోజూ రాత్రి పూట రోస్ట్ చేసిన రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తినాలి. దీని వల్ల ఆస్తమా దరికి రాదు. వెల్లుల్లితో కాచిన పాలను ఉదయం, రాత్రిపూట తీసుకుంటే జలుబు, దగ్గు, వాతం వంటి వ్యాధులు నయమవుతాయి. డయేరియాకు చక్కటి మందు వెల్లుల్లి రసం. దీంతోపాటు వెల్లుల్లి కంటిసంబంధ వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది. నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. గాయాలు మాన్పించే యాంటీ సెప్టిక్‌గా పని చేస్తుంది. వెల్లుల్లిని మనం తీసుకునే ఆహారంతో కలిసి తీసుకుంటే శరీరంలో ఉండే వ్యర్థపదార్థాలు తొలగిపోతాయి.

Tags: Garlic, antioxidant, good for health, experts, painkiller


Next Story

Most Viewed