- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వెండి తెరపై గంగూలీ బయోపిక్.. హీరో ఫిక్స్

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, మిస్టర్ కూల్ ధోనీపై బయోపిక్స్ వచ్చాయి. త్వరలో 1983లో ప్రపంచ కప్ గెలిపించిన కపిల్ దేవ్‌పైన కూడా బయోపిక్ రిలీజ్ కాబోతున్నది. బాలీవుడ్ హీర్ ఇమ్రాన్ హష్మీ హీరోగా అజారుద్దీన్ జీవిత కథనం కూడా సినిమాగా వచ్చింది.
ఈ క్రమంలోనే ఇండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో గంగూలీ పాత్రను రణబీర్ కపూర్ పోషించనున్నారు. ఇటీవల న్యూస్ 18 బంగ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ బయోపిక్ వివరాలు వెల్లడించారు. ‘నా బయోపిక్ ప్రాజెక్ట్‌కు అంగీకరించాను. హిందీలోనే తెరకెక్కనుంది. కానీ ఇప్పుడే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలు, డైరెక్టర్, హీరో ఎవరో చెప్పలేను. అన్ని ఒక కొలిక్కి రావడానికి కొంత సమయం పడుతుంది’ అని గంగూలీ తెలిపాడు.