ఉగ్రరూపం దాల్చిన గంగా నది..

by Shamantha N |
ఉగ్రరూపం దాల్చిన గంగా నది..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలకు యూపీలోని గంగానది తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రయాగ్ రాజ్, వారణాసిలో గంగానది నీటి మట్టం పెరిగింది. దీంతో ప్రయాగ్ రాజ్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

అంతేకాకుండా వారణాసిలో పలు ఘాట్లు నీట మునిగాయి. క్షణక్షణానికి గంగానదికి నీటి మట్టం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితమైన చోటుకు తరలిస్తున్నారు.

Advertisement

Next Story