- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంత్రి తలసాని పై చట్టపరంగా చర్య తీసుకోవాలి
by Shyam |

X
దిశ, ఆలేరు: తమ మనోభావాలు దెబ్బతినేలా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడరంటూ రాజాపేట పోలీస్ స్టేషన్‌లో గంగపుత్రుల సంఘం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ… రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ముదిరాజు గంగపుత్రుల మధ్య చిచ్చు పెట్టే విధంగా మంత్రి మాట్లాడారనీ… ఆ మాటలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. రెండు సంఘాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన మాటలు ప్రవర్తన ఉందని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంఘాల మధ్య, రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడే మంత్రిని ఏ విధంగా క్యాబినెట్‌లో కొనసాగి స్తారని ప్రశ్నించారు. మంత్రిపై తప్పనిసరిగా చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Next Story