అరుదైన ఘట్టం..75 వేల ఇనుప నట్లతో గాంధీ విగ్రహం

by srinivas |
అరుదైన ఘట్టం..75 వేల ఇనుప నట్లతో గాంధీ విగ్రహం
X

దిశ, ఏపీ బ్యూరో: శిల్పకళలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గుంటూరు జిల్లా మరోసారి చరిత్ర సృష్టించనుంది. ఇప్పటి వరకూ శిల్పాలను తయారు చేయడంలో విశేష ప్రతిభ ఉన్న గుంటూరు జిల్లా తాజాగా వ్యర్థాలతో కూడా జీవం ఉట్టిపడే మహాత్మాగాంధీ శిల్పాన్ని తయారుచేసి కీర్తిప్రతిష్టలను సంపాదించుకోనుంది. ఇనుప వ్యర్థాలతో శిల్పాలను తయారుచేస్తూ.. విదేశాల్లోనూ తమ ప్రతిభకనబరుస్తున్న స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు తాజాగా గాంధీ విగ్రాహాన్ని రూపొందించారు.

ఈ విగ్రహం 10 అడుగుల ఎత్తుతో తయారుచేశారు. ఈ విగ్రహతయారీ కోసం ఏకంగా 75 వేల ఇనుప నట్లను ఉపయోగించారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డులో చోటు సంపాదించడమే లక్ష్యంగా విగ్రహాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని తమ శిల్పశాల ఎదుటే ప్రదర్శనకు ఉంచారు. విగ్రహాన్ని చూసిన ప్రజలు వారి ప్రతిభను చూసి ప్రశంసిస్తున్నారు

Advertisement

Next Story