- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేఎల్ రాహుల్ క్యాచ్‌పై వివాదం
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021లో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చివర్లో రసవత్తర పోరు జరుగుతున్న సమయంలో శివమ్ మావీ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ కొట్టిన బంతిని రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఫ్రంట్ డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. అయితే అంపైర్లకు స్పష్టత లేకపోవడంతో థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. ఆ సమయంలో పలు యాంగిల్స్‌లో క్యాచ్ పట్టిన విధానాన్ని చూసిన అంపైర్ అది నేలకు తాకినట్లుగా భావించి నాటౌట్ గా ప్రకటించాడు. దీనిపై కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. ఇలాంటి కీలకమైన నిర్ణయాలు ప్రత్యర్థి జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అన్నాడు. ‘రాహుల్ అవుటైనట్లు తొలి క్లిప్‌లోనే స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ, నాలుగైదు యాంగిల్స్ చూసి అంపైర్ నాటౌట్ ప్రకటించాడు. అయినా స్లో మోషన్ లేకుండా చూసినప్పుడే అది అవుట్ అని స్పష్టంగా తెలిసినా ఎందుకు నాటౌట్ ప్రకటించాడో అర్థం కాలేదు. ఆ క్షణంలో రాహుల్ అవుట్ అయి ఉంటే తప్పకుండా కేకేఆర్ గెలిచేది’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.