- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దోపిడీ దారుల గుండెల్లో ల్యాండ్ మైన్ పేల్చిన గడ్డ తెలంగాణ
దిశ,డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ నాయకులు ఇంద్రవెళ్లిలో సభ పెట్టినప్పుడు గజ్వేల్ సభ పెట్టాలని సవాల్ విసిరారు. ఇప్పుడు లక్షమంది కార్యకర్తలతో గజ్వేల్‌లో సభ నిర్వహిస్తున్నాం. గజ్వేల్‌లో దాదాపు రెండు లక్షల మంది శ్రేణులు కదం తొక్కి సభకు వచ్చారు. మరో ఆరు నెలల్లో గజ్వేల్లో సభ పెట్టి 5 లక్షల మందితో సభ పెడుతాం. కొమురం భీం, చాకలి అయిలమ్మ, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలనకోసం అలుపెరగని పోరాటం చేసి నిజాంలను తరిమి కొట్టిన గడ్డ ఇది.
తెలంగాణ అంటే ఎంతో మందికి దోపిడీ దారుల గుండెల్లో ల్యాండ్ మైన్ పేల్చిన ల్యాండ్ ఇది. నిజాముల పైజామాలు ఊడకొట్టిన గడ్డ ఇది. రజాకార్లను తరిమికొట్టిన గడ్డ, దొరల గడీలను బద్దలు కొట్టిన గడ్డ ఇది. ఇక చాలు దొర నీ పాలన.. నిన్ను వంద మీటర్లు లోతున పాతి పెడతామన్న గడ్డ ఇది. రాష్ట్రమొచ్చినాక కేసీఆర్ సీఎం అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు.. గిట్టుబాటు ధర ఇస్తాడు, నిరుద్యోగులకు ఉద్యోగాదాలిస్తాడు, మూడెకరాల భూమి ఇస్తాడు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తాడు అని రెండు సార్లు సీఎం చేసిండ్రు. దగుల్బాజీని రెండు సార్లు ఎమ్మెల్యే చేస్తే మల్లన్న సాగర్ తెచ్చి 60 వేల ఎకరాలు తీసుకొని 14 గ్రామాలను నట్టేట ముంచి మీ బతుకులను బజార్ల పడేసిండు. గజ్వేల్ చుట్టూ డబుల్ బెడ్రూంలు కట్టించి మల్లన్న సాగర్ నిర్వాసితులను పట్టించుకోలేదు. ప్రజలు ఓ సారి ఆలోచించండి. అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గజ్వేల్ బహిరంగ సభలో నిప్పులు చెరిగారు.