- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదర్శంగా గజ్వేల్ అభివృద్ధి కార్యక్రమాలు: సబితా ఇంద్రారెడ్డి
గజ్వేల్‌లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులను కలెక్టర్‌లు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మునిసిపల్ చైర్మన్‌లతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఇందులో భాగంగా గజ్వేల్‌లో అత్యద్భుతంగా, ఆధునికంగా నిర్మించిన సమీకృత శాకాహార, మాంసాహార మోడల్ మార్కెట్‌ను, వైకుంఠదామాన్ని, రాశివనం పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. వారి అడుగుజాడల్లోనే నడుస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నిలపడానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్శనలో మూసి తీరప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మెన్ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, మెతుకు ఆనంద్, కలెక్టర్ అమోయ్ కుమార్, మేయర్లు, చైర్ పర్సన్‌లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.