- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భవిష్యత్తు డ్రోన్లదే.. వాటికీ రిజిస్ట్రేషన్లు చేస్తాం : కేంద్ర మంత్రి

దిశ, తెలంగాణ బ్యూరో: అభివృద్ధి కార్యక్రమాల అంశాలు చర్చిచేందుకే సీఎం కేసీఆర్‌ను కలిసినట్టుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింథియా వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ప్రధాన మంత్రి మోడీ లక్ష్యాలను సాధించడం కోసమే సమావేశమయ్యామని తెలిపారు. శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని త్వరలోనే అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీతో పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన, లోక్ సభ, ఉప ఎన్నిక, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ ప్రజల ఆదరణను సొంతం చేసుకుందని వివరించారు. డ్రోన్ల ద్వారా మెడిసిన్ సరఫరా చేయడం గొప్ప మార్పుగా అభివర్ణించారు. భవిష్యత్తుల్లో డ్రోన్ టెక్నాలజీ ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతుందని వివరించారు. నేడు ప్రతి ఒక్కరూ వాహానం వినియోగిస్తున్నట్టుగానే రోజు వారి జీవితంలో డ్రోన్‌లను కూడా వినియోగిస్తారని చెప్పారు. వాహన రిజిస్ట్రేషన్ల మాదిరిగా డ్రోన్లకు రిజిస్ట్రేషన్లు చేపడుతామన్నారు.
దేశ వ్యాప్తంగా విమానయాన రంగంలో అభివృద్ధి సాధించామని త్వరలోనే డిజిటర్ ఎయిర్ స్పెస్‌ను ప్రవేశ పెట్టేందుకు అనుమతులను మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్‌లో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు. విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని, కేవలం కొన్ని సంవత్సరాల పాటు లీజుకు మాత్రమే ఇస్తామని పేర్కొన్నారు. చిన్న చిన్న పట్టణాలకు కూడా విమాన సదుపాయాన్ని కల్పించమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునంధన్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.