వర్షానికి నీట మునిగిన పత్తి పంటలు..!

దిశ, ఆందోల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. పలు చోట్ల పత్తి పంటలు నీట మునిగాయి. మరోవైపు భారీ వర్షానికి శిథిలావస్థకు చేరిన ఇండ్లు కూడా కూలిపోయాయి.

 

Advertisement