- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సంపూర్ణ లాక్‌డౌనే పరిష్కారం: రాహుల్ గాంధీ
by Shamantha N |

X
న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించాలనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తేనే దేశంలో కరోనా చైన్‌ను బ్రేక్ చేయడానికి అవకాశం ఉన్నదని సూచించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన… ‘సంపూర్ణ లాక్‌డౌన్ పెడితేనే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చు. బలహీన వర్గాలకు న్యాయ్ పథకాన్ని అమలుపరుస్తూ లాక్‌డౌన్ విధించాలి..’ అని ట్వీట్ చేశారు. ‘న్యాయ్’ (కనీస ఆదాయ పథకం) 2019 పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన హామీ అనే విషయం తెలిసిందే. దీనికింద ఆర్థికంగా వెనుకబడిన 20 శాతం మంది ప్రజలకు ఏడాదికి రూ. 72 వేలు గ్యారెంటీ ఇన్‌కమ్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
Next Story