- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నాగార్జునసాగర్‌కు జల సవ్వడి
దిశ నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లో కృష్ణమ్మ సందడి మొదలైంది. శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 584 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ఈరోజు సాయంత్రం 22 క్రస్టు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఇన్‌ఫ్లో 5.14 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
అన్నదాతల్లో ఆనందం
నాగార్జునసాగర్ డ్యామ్ కు పూర్తిస్థాయిలో నీరు చేరుతుండటంతో ఆయకట్టు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాలో బోరుబావులు, నీటివసతి ఉన్నచోట రైతులు ఇప్పటికే నారుమళ్లు సాగు చేస్తున్నారు. కాలువలకు నీటిని విడుదల చేయడంతో నాట్లు వేసుకునే ప్రణాళికతో సాగుకు సిద్ధమవుతున్నారు. ఆయకట్టుకు ఈ ఏడాది సకాలంలో సాగునీరు అందించే వెసులుబాటు కలిగింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోవడంతో ఆయకట్టుకు నీటి కొరత ఉండదని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. సాగర్ ఎడమ కాలువ కుడి కాలువ కింద తెలంగాణతో నల్లగొండ ఖమ్మం వరంగల్ పాటు ఏపీలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఆయకట్టు ఉంది. సాగర్‌లో నీటి లభ్యత పెరుగుతున్నందున రైతులకు సకాలంలో సాగునీరు విడుదల చేసే వెసులుబాటు కలిగింది. అన్నదాతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.