బర్డ్ ఫ్లూ డేంజర్.. ఫుడ్ సేఫ్టీ విభాగం జాగ్రత్తలు

by Anukaran |   ( Updated:2021-01-23 11:36:40.0  )
బర్డ్ ఫ్లూ డేంజర్.. ఫుడ్ సేఫ్టీ విభాగం జాగ్రత్తలు
X

దిశ, వెబ్‌డెస్క్ : బర్డ్ ప్లూ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన నేపథ్యంలో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించినట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం వెల్లడించింది.

1. సగం ఉడకబెట్టిన కోడి గుడ్లను తినరాదు.
2. సగం వండిన కోడి మాంసాన్ని తీసుకోరాదు.
3. బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగులోకి వచ్చిన ప్రాంతాల్లో పక్షులను నేరుగా తాకరాదు.
4. చనిపోయిన పక్షులను ఖాళీ చేతులతో ముట్టుకోరాదు.
5. పచ్చి మాంసాన్ని ఇంట్లో తెరచి ఉంచరాదు.
6. పచ్చి మాంసాన్ని నేరుగా ముట్టుకోరాదు.
7. కుకింగ్ సమయంలో చికెన్‌ను హ్యాండ్ గ్లౌవ్స్ ధరించి ముట్టుకోవాలి.
8. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
9.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
10.చికెన్, కోడిగుడ్లు, పక్షులకు చెందిన మాంసాన్ని ఉడకబెట్టకుండా అసలు తీసుకోరాదు.

Advertisement

Next Story

Most Viewed